వరి పొలాల్లో సత్వరమే నీటిని తొలగించాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:55 AM
తుఫాన్ వర్షాలకు రాంబిల్లి, కశింకోట, ఎలమంచిలి మండలాలాల్లో నీట మునిగిన వరి పొలాలను గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు మాట్లాడుతూ, వరి పొలాల్లో నుంచి వరద నీటిని సత్వరమే బయటకు పంపి, ఎకరానికి 15 కిలోల చొప్పున యూరియా, పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలని సూచించారు. చాలాచోట్ల వరి పిలక దశలో ఉందని, కొన్నిచోట్ల గింజపాలు పోసుకునే దశలో ఉందని పేర్కొన్నారు.
ఎకరానికి 15 కిలోల చొప్పున యూరియా, పొటాష్ వేయండి
మాగుడు, మావిపండు తెగుళ్ల నివారణకు చర్యలు
ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు
శాస్త్రవేత్తలతో కలిసి రాంబిల్లి, కశింకోట, ఎలమంచిలి మండలాలాల్లో పర్యటన
అనకాపల్లి అగ్రికల్చర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ వర్షాలకు రాంబిల్లి, కశింకోట, ఎలమంచిలి మండలాలాల్లో నీట మునిగిన వరి పొలాలను గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు మాట్లాడుతూ, వరి పొలాల్లో నుంచి వరద నీటిని సత్వరమే బయటకు పంపి, ఎకరానికి 15 కిలోల చొప్పున యూరియా, పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలని సూచించారు. చాలాచోట్ల వరి పిలక దశలో ఉందని, కొన్నిచోట్ల గింజపాలు పోసుకునే దశలో ఉందని పేర్కొన్నారు. పూతదశ నుంచి గింజకట్టే దశలో ఉన్న వరి పొలాల్లో నీటి ముంపు ఉన్నట్టయితే నీటిని తొందరగా తొలగించి, ప్రాపికొనజోల్ ప్రాపికొనజోల్ మందును ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మాగుడు, మావిపండు తెగుళ్లను నివారించవచ్చని చెప్పారు. ఆకుమడత పురుగు నివారణ కోసం ఎకరాకు 400 గ్రాముల కార్బన్‌హైడ్రోక్లోరైడ్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. చెరకు తోటల్లో నీటిని తొలగించి యూరియా, పొటాష్ ఎరువులను 20 కిలోల చొప్పున పైపాటుగా వేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ పీవీకే జగన్నాథరావు, డాక్టర్ బి.చంద్రశేఖర్, డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ సమంత , తదితరులు ముంపు ప్రాంతాలను సందర్శించారు.