పద్మాపురం గార్డెన్‌లో వాటర్ రెస్టారెంట్
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:11 PM
ప్రముఖ పర్యాటక కేంద్రం పద్మాపురం బొటానికల్ గార్డెన్‌ను సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా చర్యలు చేపడుతున్నారు.
నిర్మాణ పనులు ప్రారంభం
అరకులోయ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
ప్రముఖ పర్యాటక కేంద్రం పద్మాపురం బొటానికల్ గార్డెన్‌ను సందర్శించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గార్డెన్ మధ్యలో వాటర్ రెస్టారెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఒకేసారి 20 మంది రెస్టారెంట్‌లో విందు ఆరగించేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పునాది పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.