Share News

డుడుమ నుంచి నీటి విడుదల

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:17 PM

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండడంతో ఆదివారం ఆరవ గేటును ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

డుడుమ నుంచి నీటి విడుదల
డుడుమ జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండడంతో 1,500 క్యూసెక్కులు దిగువకు..

ముంచంగిపుట్టు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండడంతో ఆదివారం ఆరవ గేటును ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు డుడుమ జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ఆదివారానికి 2587.07 అడుగులకు చేరింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Updated Date - Aug 23 , 2026 | 11:17 PM