పశువుల తొట్టెల్లో నీరు
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:20 AM
మండలంలోని పలు గ్రామాల్లో పశువుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన తొట్టెల్లో పంచాయతీల కార్యదర్శులు నీటిని నింపారు. ‘తొట్లు సరే.. నీళ్లేవి?’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
మాకవరపాలెం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) మండలంలోని పలు గ్రామాల్లో పశువుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన తొట్టెల్లో పంచాయతీల కార్యదర్శులు నీటిని నింపారు. ‘తొట్లు సరే.. నీళ్లేవి?’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కొన్నిచోట్ల సమీపంలో వున్న వ్యవసాయ బోర్లు నుంచి నీటిని నింపగా, మరికొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని తెచ్చి తొట్టెల్లో పోశారు. మండలంలోని అన్ని పశువుల తొట్టెల్లో రోజూ నీటిని నింపాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించినట్టు ఎంపీడీఓ ఛాయసుధ తెలిపారు.