Share News

జల సంరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:09 PM

జల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల్లో జలధార- జలహారతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

జల సంరక్షణ అందరి బాధ్యత
నేలపై కూర్చొని మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి

జిల్లా కలెక్టర్‌ టి. నిశాంతి

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్‌

పెదబయలు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల్లో జలధార- జలహారతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్‌ నిశాంతి మాట్లాడుతూ భావితరాల కోసం జల సంరక్షణ అత్యంత అవసరమన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు తవ్వడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం చేయాలన్నారు. గ్రామంలో పరిశుభ్రత లేకపోతే దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం అందించిన దోమతెరలను వినియోగించాలన్నారు. దోమల నివారణ కోసం పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు చేయరాదని, బాల్య వివాహాలు చేస్తే అనేక అనర్ధాలకు దారితీస్తాయన్నారు. పిల్లలకు పూర్తిస్థాయిలో విద్యను అందించాలన్నారు. ఆర్గానిక్‌ పంటలను సాగు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు. అంతకు ముందు గ్రామంలో ఆమె మొక్కలు నాటారు. జిల్లా అధికారులతో కలిసి గ్రామస్థులందరితో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై కలెక్టర్‌ నిశాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, డీఎల్పీవో కుమార్‌, డీఈవో కృష్ణారావు, టీడబ్లూ డీడీ పరిమళ, ఐసీడీఎస్‌ పీడీ, ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:09 PM