Share News

రిజర్వాయర్లకు జలకళ

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:29 AM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలకు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో చుక్కనీరు లేక అడుగంటిపోయిన రిజర్వాయర్లలో ఇప్పుడు వరద నీరు చేరి క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు నీటిమట్టాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే తాజా వర్షాలు ఈ లోటును కాస్త భర్తీ చేశాయనే చెప్పాలి.

రిజర్వాయర్లకు జలకళ
కళకళలాడుతున్న రైవాడ జలాశయం

- భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో పెరిగిన నీటిమట్టాలు

- ఐదు రోజుల క్రితం వరకు అడుగంటిన జలాశయాలు

- మేలు చేసిన తీవ్ర వాయుగుండం

- గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టాలు తక్కువే

- అయితే ఎల్‌నినో ప్రభావంతో చుక్కనీరు లేని పరిస్థితి నుంచి కోలుకున్న వైనం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలకు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో చుక్కనీరు లేక అడుగంటిపోయిన రిజర్వాయర్లలో ఇప్పుడు వరద నీరు చేరి క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీ నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు నీటిమట్టాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే తాజా వర్షాలు ఈ లోటును కాస్త భర్తీ చేశాయనే చెప్పాలి.

రైవాడ జలాశయంలో...

దేవరాపల్లి: మండలంలోని రైవాడ జలాశయంలోకి రెండు వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో 105 మీటర్లు నీటిమట్టం చేరుకుంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, గత మూడు రోజుల క్రితం 102 మీటర్లు ఉన్న నీటిమట్టం సమ్మెదగెడ్డ, కుడియా, పినకోట గెడ్డల నుంచి రెండు వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో శుక్రవారం సాయంత్రానికి 105 మీటర్లకు చేరుకుంది.

పెద్దేరులో...

మాడుగుల రూరల్‌: మండలంలోని రావిపాలెం పెద్దేరు జలాశయానికి వరదనీరు పెరుగుతున్నది. వర్షాలు కురవక జలాశయం నీటిమట్టం అట్టడుగు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా, వర్షాలు కురవక ముందు నీటిమట్టం 128.45 మీటర్లు ఉంది. తాజాగా కురిసిన భారీ వర్షాలతో వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 722 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయం నీటిమట్టం 133.40 మీటర్లకు చేరింది.

కోనాంలో...

చీడికాడ: భారీ వర్షాలకు కోనాం జలాశయంలోకి అధికంగా వర్షపు నీరు చేరుతోంది. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, నాలుగు రోజుల క్రితం వరకు 91 మీటర్లు ఉంది. భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి 95 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 700 క్యూసెక్కులు వస్తుంది. ఈ ఖరీఫ్‌లో కాలువ కింద వేసిన నాట్లుకు ఈ నీరు సరిపోతుందని, పూర్తిస్థాయిలో పంట చేతికి వస్తుందని ఇరిగేషన్‌ ఏఈఈ బండారు సత్యనారాయణదొర తెలిపారు.

ు జిల్లాలో జలాశయాల్లో శుక్రవారం నాటికి నీటిమట్టాల వివరాలు ఇలా....

-----------------------------------------------------------------

జలాశయం నీటి సామర్థ్యం ప్రస్తుత నీటిమట్టం గతేడాది నీటిమట్టం

------------------------------------------------------------------

తాండవ 380 366.80 370.90 అడుగులు

రైవాడ 114 104.50 113.23 మీటర్లు

కోనాం 101.25 94.50 88.50 మీటర్లు

వరహా 460 439.00 451.00 అడుగులు

పెద్దేరు 137 132.80 136.00 మీటర్లు

----------------------------------------------------------------

Updated Date - Sep 26 , 2026 | 12:29 AM