కొట్టుకుపోయిన మూలగుమ్మి కల్వర్టు
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:09 PM
ఆర్నబ్ తుఫాన్ వర్షాలకు మండలంలోని లుంగపర్తి పంచాయతీ మూలగుమ్మి-ఒనుకొండ మధ్యలో గల కల్వర్టు కొట్టుకుపోయింది.
నిలిచిన మూడు గ్రామాల గిరిజనుల రాకపోకలు
అనంతగిరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):ఆర్నబ్ తుఫాన్ వర్షాలకు మండలంలోని లుంగపర్తి పంచాయతీ మూలగుమ్మి-ఒనుకొండ మధ్యలో గల కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో కటికిమామిడి, బురదగుమ్మివలస, ఓనుకొండ గ్రామాల గిరిజనుల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా మూడు గ్రామాల గిరిజనులు గెడ్డ దాటేందుకు సాహసించలేకపోతున్నారు. అధికారులు స్పందించి మూలగుమ్మి గ్రామ సమీపంలో గల కల్వర్టును పునరుద్ధరించాలని గిరిజనులు కోరుతున్నారు.