మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:24 AM
ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం సాయంత్రం నగరానికి విచ్చేశారు.
గోపాలపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం సాయంత్రం నగరానికి విచ్చేశారు. ఆయనకు విమానాశ్రయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, మాజీ ఎమ్మెల్సీలు దువ్వారపు రామారవు, బుద్ధ నాగజగదీశ్వరరావు, నేతలు నజీర్, బొండా జగన్, లొడగల కృష్ణ, కోరాడ రాజబాబు, తదితరులు స్వాగతం పలికారు.
వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్
నగరంలోని వాల్తేర్ క్లబ్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం) సోదరుడి కుమారుడి వివాహ వేడుకకు మంత్రి లోకేశ్ హాజరయ్యారు. వధూవరులు సత్యనారాయణరావు, లక్ష్మిసౌపర్నికలను ఆశీర్వదించారు. దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఇతర నాయకులు ఉన్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్లారు.