గ్రేటర్‌లో వార్డు రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:16 AM
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు రిజర్వేషన్లు ఖరారుచేస్తూ జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిశోర్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదల
ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు పది
బీసీలకు 49, జనరల్ 60
విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు రిజర్వేషన్లు ఖరారుచేస్తూ జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిశోర్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ వార్డును ఏ కేటగిరీకి కేటాయించారో నోటిఫై చేయడంతో ఇక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడమే మిగిలింది.
జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజన చేయడంతో జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ఎన్ని వార్డులు కేటాయించాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ జారీచేసిన విషయం తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో ఎస్టీలకు ఒక వార్డు కేటాయించగా, ఎస్సీ జనరల్‌కు ఐదు, ఎస్సీ మహిళలకు ఐదు, బీసీ జనరల్‌కు 25, బీసీ మహిళలకు 24, ఓపెన్ కేటగిరీ/ జనరల్‌కు 29, జనరల్ మహిళలకు 31 వార్డులను కేటాయించాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన లెక్కల ప్రాతిపదికన ఏ కేటగిరీకి ఏఏ వార్డులు కేటాయించవచ్చునో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రతిపాదనలు తయారుచేసి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు పంపించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ మంగళవారం రాత్రి వార్డుల రిజర్వేషన్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఎవరెవరికి ఏఏ వార్డులు అంటే,,,
ఎస్టీ జనరల్: 105
ఎస్సీ జనరల్: 17, 33, 64, 74, 76
ఎస్సీ మహిళ: 1, 32, 56, 57, 70
బీసీ జనరల్: 2, 14, 15, 31, 34, 37, 48, 58, 60, 61, 62, 72, 73, 80, 83, 87, 90, 93, 102, 106, 113, 114, 116, 117, 120
బీసీ మహిళ: 4, 5, 7, 9, 13, 16, 22, 23, 36, 38, 41, 42, 46, 47, 55, 59, 66, 78, 94, 107, 108, 109, 111
అన్ రిజర్వుడ్/జనరల్: 6, 11, 18, 25, 26, 29, 30, 35, 39, 45, 50, 54, 68, 69, 79, 86, 88, 91, 95, 96, 97, 98, 99, 100, 101, 103, 104, 115, 119
జనరల్ మహిళ: 3, 10, 12, 19, 20, 21, 24, 27, 28, 40, 43, 44, 49, 51, 52, 53, 61, 63, 65, 67, 71, 75, 77, 82, 84, 85, 89, 92, 110, 112, 118
120 వార్డులు...1,990 పోలింగ్ కేంద్రాలు
18.4 లక్షల మంది ఓటర్లు
ఎన్నికల విధులకు 14,328 మంది
విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధ, గురువారాల్లో షెడ్యూల్, నోటిఫికేషన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లుపూర్తిచేశారు. ఎన్నికల విధులకు 14,328 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించి, ఇప్పటికే వివిధ శాఖల నుంచి వారిని సమీకరించడంతోపాటు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. జీవీఎంసీ పది జోన్‌ల పరిధిలో 1,990 పోలింగ్ బూత్‌లలో 18.4 లక్షల మంది తమ ఓటును వినియోగించుకోనున్నారు.
జోన్ వార్డులు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు
భీమిలి 5 78 66,446
మధురవాడ 7 162 1,49,452
ఈస్ట్ 18 309 2,96,124
సౌత్ 16 249 2,17,817
నార్త్ 20 302 2,91,691
వెస్ట్ 17 245 2,14,094
గాజువాక 19 329 2,98,228
అగనంపూడి 5 76 69,796
అనకాపల్లి ఆరు 89 76,950
పెందుర్తి ఏడు 152 1,49,367