వార్డుల పునర్విభజనకు శ్రీకారం
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:01 AM
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక మునిపల్ అధికారులు వార్డుల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 వార్డులు వుండగా.. కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, మరికొన్ని వార్డుల్లో తక్కువ జనాభా వున్నారు.
జనాభా లెక్కలు, ఇతర రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
ఎలమంచిలిలో 25 నుంచి 32కు పెరగనున్న వార్డులు
ఎలమంచిలి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక మునిపల్ అధికారులు వార్డుల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 వార్డులు వుండగా.. కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, మరికొన్ని వార్డుల్లో తక్కువ జనాభా వున్నారు. వైశాల్యం పరంగా కూడా అంతరాలు వున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం వున్న వార్డులను పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో వార్డుల సంఖ్యలను 25 నుంచి 32కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వార్డుల పునర్విభజన ప్రక్రియలో మునిసిపల్ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. గురువారం మునిసిపల్ కార్యాలయం ఆవరణలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు మ్యాప్ పాయింట్‌తోపాటు రికార్డుల పరిశీలన పనులు చేపట్టారు. మునిసిపాలిటీలో 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పునర్విభజన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మునిసిపాలిటీలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, పట్టణంలో మరో ఏడు వార్డులు పెరగనుండడంతో కౌన్సిలర్లుగా పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు కొత్త వార్డుల ఏర్పాట్లు, వార్డుల పరిధిపై ఆరా తీస్తున్నారు.