వార్డుల విభజన పూర్తి
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:29 AM
జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈనెల రెండో తేదీన వార్డుల విభజన ప్రారంభించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు బుధవారం నాటికి దానిని పూర్తిచేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి వార్డుకు సగటున 15,400 మంది ఉండేలా 120 వార్డులను విభజించాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ కమిషనర్ ఈనెల ఒకటిన ఆదేశాలు జారీచేశారు.
ముసాయిదా సిద్ధం
జోన్‌ల వారీగా నివేదికను
సీపీపీకి అందజేసిన అధికారులు
పరిశీలించిన తర్వాత కమిషనర్‌కు..
26న ప్రాథమిక ముసాయిదా విడుదల
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈనెల రెండో తేదీన వార్డుల విభజన ప్రారంభించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు బుధవారం నాటికి దానిని పూర్తిచేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి వార్డుకు సగటున 15,400 మంది ఉండేలా 120 వార్డులను విభజించాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ కమిషనర్ ఈనెల ఒకటిన ఆదేశాలు జారీచేశారు. ఈనెల 26వ తేదీ నాటికి వార్డుల విభజనకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు వార్డు సచివాలయాలు, జోనల్ కార్యాలయాలు, ముఖ్యమైన కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు వార్డుల విభజన ప్రక్రియను జోన్‌ల వారీగా పూర్తిచేసి, ముసాయిదాను చీఫ్ సిటీప్లానర్ ఎ.ప్రభాకరరావుకు బుధవారం సమర్పించారు. ఆయన వాటిని పరిశీలించిన తర్వాత మార్పులు, చేర్పులు అవసరమైతే సరిచేసిన తర్వాత కమిషనర్‌కు గురువారం అందజేస్తారు. కమిషనర్ కూడా సంతృప్తిచెందితే 26న ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసి, వారం రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర మునిసిపల్ శాఖ కమిషనర్‌కు పంపిస్తారు.