వాల్తేరు డివిజన్‌కు 11,598.07 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:31 AM
వాల్తేరు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.10,422.56 కోట్ల ఆదాయం సాఽధించి జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరించారు. 851 మిలియన్ టన్నుల సరుకును లోడింగ్ చేసి ఐదో స్థానంలో నిలిచిందన్నారు.
గత ఏడాది కంటే 17 శాతం అధికం
సరుకు రవాణా ద్వారా రూ.10,422 కోట్లు
జాతీయ స్థాయిలో ఐదో స్థానం
డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
విశాఖపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):
వాల్తేరు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.10,422.56 కోట్ల ఆదాయం సాఽధించి జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరించారు. 851 మిలియన్ టన్నుల సరుకును లోడింగ్ చేసి ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఇది డివిజన్ చరిత్రలోనే అత్యధికమని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 17.25 శాతం వృద్ధి నమోదైందన్నారు. సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ కలిపి 150 మిలియన్ టన్నులు దాటడం మరో రికార్డుగా పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల సంఖ్య 33.42 మిలియన్లకు పెరిగిందని, గత ఏడాదితో పోల్చితే 6.6 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.881.37 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం డివిజన్ మొత్తం ఆదాయం చూసుకుంటే రూ.11,598.07 కోట్లకు చేరిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 17 శాతం అధికమని డీఆర్‌ఎం వివరించారు. క్యాటరింగ్ ద్వారా రూ.9.81 కోట్లు, నాన్ ఫేర్ రెవెన్యూ ద్వారా రూ.11.14 కోట్లు, టికెట్ చెకింగ్ ద్వారా రూ.26.21 కోట్లు, పార్కింగ్ ద్వారా రూ.4.26 కోట్లు వచ్చిందన్నారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు ప్లాటినం రేటింగ్, గ్రీన్ స్టేషన్ సర్టిఫికేషన్ వచ్చాయన్నారు.