Share News

విద్యార్థినులకు నడకయాతన

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:43 AM

స్థానిక బీసీ వెల్ఫేర్‌ బాలికల వసతి గృహం విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నారు.

విద్యార్థినులకు నడకయాతన
కాలినడకన పాఠశాలకు వెళుతున్న బీసీ వెల్ఫేర్‌ వసతి గృహం విద్యార్థినులు

బీసీ హాస్టల్‌ నుంచి పాఠశాలకు రోజూ 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి

చింతపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక బీసీ వెల్ఫేర్‌ బాలికల వసతి గృహం విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళుతున్నారు.

సుమారు 40 ఏళ్ల క్రితం చింతపల్లిలో బీసీ వెల్ఫేర్‌ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. బీసీ వసతి గృహానికి అనుబంధంగా పాఠశాల లేదు. వసతి గృహంలో చేరిన విద్యార్థినులు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ వెల్ఫేర్‌ వసతి గృహం ఐటీడీఏ క్వార్టర్స్‌ వద్ద ఉన్నది. వసతి గృహంలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 80 మంది గిరిజన విద్యార్థినులు చదువుతున్నారు. వసతి గృహానికి 1.5 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉండడంతో రోజూ కాలినడకన ఉదయం పాఠశాలకు వెళ్లి, సాయంత్రం వసతి గృహానికి వస్తున్నారు. ఎండాకాలం, వర్షాకాలంలో వీరు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్‌ వసతి గృహానికి అనుబంధంగా పాఠశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:44 AM