Share News

పోటెత్తిన ఓటరు

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:23 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలమంచిలి ఓటర్లు పోటెత్తారు. రికార్డుస్థాయిలో 76.08 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 32 వార్డుల్లో 63 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36,526 మంది ఓటర్లకుగాను 27,981 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 13,093 మంది, మహిళలు 14,885 మంది, ఇతరులు ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలట్‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ర్టాంగ్‌ రూమ్‌ (గురవప్ప కల్యాణమండలం)కు తరలించారు.

పోటెత్తిన ఓటరు
పట్టణంలోని ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

ఎలమంచిలిలో 76.08 ు పోలింగ్‌

మొత్తం ఓటర్లు: 36,526

పోలైన ఓట్లు: 27,981

పురుషులు 17,450 మందికిగాను 13,107 మంది, మహిళలు 19,068 మందికిగాను 14,680 మంది, ఇతరులు ఎనిమిది మందికి ముగ్గురు ఓటు

ఎలమంచిలి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలమంచిలి ఓటర్లు పోటెత్తారు. రికార్డుస్థాయిలో 76.08 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 32 వార్డుల్లో 63 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36,526 మంది ఓటర్లకుగాను 27,981 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 13,093 మంది, మహిళలు 14,885 మంది, ఇతరులు ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలట్‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ర్టాంగ్‌ రూమ్‌ (గురవప్ప కల్యాణమండలం)కు తరలించారు.

జనరల్‌ మహిళలకు కేటాయించిన ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి కూటమి (బీజేపీ) తరపున పిల్లా రమాకుమారి, వైసీపీ నుంచి బొద్దపు తులసీ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దొడ్డి శాంతి పోటీచేశారు. మొత్తం 32 వార్డు కౌన్సిలర్‌ పదవులకు 77 మంది పోటీ పడ్డారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌.. పది గంటల తరువాత ఊపందుకుంది. చైర్‌పర్సన్‌ పదవికి కూటమి తరపున పోటీ చేస్తున్న పిల్లా రమాకుమారి కుటుంబ సభ్యులతో కలిసి తులసీనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బొద్దపు తులసి కుటుంబ సభ్యులతో కలిసి పెద్దపల్లి వార్డులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలమంచిలిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తులసీనగర్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ విజయకృష్ణన్‌; పెద్దపల్లి, ఎర్రవరం వార్డుల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ అధికారులతో మాట్లాడి, వారికి పలు సూచనలు చేశారు.

పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటింగ్‌ వివరాలు.

ఒకటో వార్డు ఒకటో నంబరు పోలింగ్‌ కేంద్రంలో 599 ఓట్లుకి 536 ఓట్లు, రెండో నంబరు పోలింగ్‌ కేంద్రంలో 599 ఓట్లుకి 497, 2/1 పోలింగ్‌ కేంద్రంలో 568 ఓట్లుకి 476 ఓట్లు, 2/2 కేంద్రంలో 568 ఓట్లుకి 506 ఓట్లు, 3/1 కేంద్రంలో 585 ఓట్లుకి 524 ఓట్లు, 3/2 కేంద్రంలో 585 ఓట్లుకి 274 ఓట్లు, 4/1 కేంద్రంలో 608ఓట్లుకి 517 ఓట్లు, 4/2 కేంద్రంలో 609 ఓట్లుకి 514 ఓట్లు, 5/1 కేంద్రంలో 539 ఓట్లుకి 421 ఓట్లు, 5/2 కేంద్రంలో 500 ఓట్లుకి 379 ఓట్లు పోలయ్యాయి.

ఆరోవార్డు ఒకటో పోలింగ్‌ బూత్‌లో 562 ఓట్లుకి 498, 6/2 కేంద్రంలో 562 ఓట్లుకి 496, 7/1 కేంద్రంలో 592 ఓట్లుకి 442, 7/2 కేంద్రంలో 592 ఓట్లుకి 415, 8/1 కేంద్రంలో 608 ఓట్లుకి, 388, 8/2 కేంద్రంలో 608 ఓట్లుకి 363, 9/1 కేంద్రంలో 576 ఓట్లుకి 396, 9/2 కేంద్రంలో 576 ఓట్లుకి 409, 10/1 కేంద్రంలో 525 ఓట్లుకి 395, 10/2 కేంద్రంలో 525 ఓట్లుకి 343, 11/1 కేంద్రంలో 526 ఓట్లుకి 383, 11/2 కేంద్రంలో 525 ఓట్లుకి 295, 12/1 కేంద్రలో 519 ఓట్లుకి, 388, 12/2 కేంద్రంలో 519 ఓట్లుకి 344, 13/1 కేంద్రంలో 548 ఓట్లుకి 439, 13/2 కేంద్రంలో 547 ఓట్లుకి 426, 14/1 కేంద్రంలో 621 ఓట్లుకి 475, 14/2 కేంద్రంలో 621 ఓట్లుకి 445, 15/1 కేంద్రంలో 627 ఓట్లుకి 506, 15/2 కేంద్రంలో 626 ఓట్లుకి 550 ఓట్లు పోలయ్యాయి.

పదహారో వార్డు ఒకటో నంబరు పోలింగ్‌ కేంద్రంలో 550 ఓట్లుకి 511, 16/2 కేంద్రంలో 569 ఓట్లుకి 375, 17/1 కేంద్రంలో 610 ఓట్లుకి 499, 17/2 కేంద్రంలో 611 ఓట్లుకి 500, 18/1 కేంద్రంలో 625 ఓట్లుకి 379, 18/2 కేంద్రంలో 625 ఓట్లుకి 521, 19/1 కేంద్రంలో 627 ఓట్లుకి 366, 19/2 కేంద్రంలో 627 ఓట్లుకి, 348, 20/1 కేంద్రంలో 627 ఓట్లుకి 322, 21/1 కేంద్రంలో 528 ఓట్లుకి 294, 21/2 కేంద్రంలో 553 ఓట్లుకి 400, 22/1 కేంద్రంలో 528 ఓట్లుకి 294, 22/2 కేంద్రంలో 528 ఓట్లుకి 337 ఓట్లు పోలయ్యాయి.

ఇరవై మూడో వార్డు ఒకటో నంబరు పోలింగ్‌ కేంద్రంలో 524 ఓట్లుకి 384, 23/2 కేంద్రంలో 523 ఓట్లుకి 375, 24/1 కేంద్రంలో 551 ఓట్లుకి 375, 24/2 కేంద్రంలో 550 ఓట్లుకి 329, 25/1 కేంద్రంలో 553 ఓట్లుకి 362, 25/2 కేంద్రంలో 552 ఓట్లుకి 378, 26/1 కేంద్రంలో 544 ఓట్లుకి 400, 26/2 కేంద్రంలో 547 ఓట్లుకి 340, 27/1 కేంద్రంలో 649 ఓట్లుకి 598, 27/2 కేంద్రంలో 649 ఓట్లకు 604, 28/1 కేంద్రంలో 650 ఓట్లుకి 547, 28/2 కేంద్రంలో 649 ఓట్లుకి 587, 29/2 కేంద్రంలో 601 ఓట్లుకి 515, 30/1 కేంద్రంలో 543 ఓట్లుకి 484, 30/2 కేంద్రంలో 544 ఓట్లుకి 487, 31/1 కేంద్రంలో 524 ఓట్లుకి 461, 31/2 కేంద్రంలో 523 ఓట్లుకి 453, 32/1 861 ఓట్లుకి 757 ఓట్లు పోలయ్యాయి.

Updated Date - Nov 02 , 2026 | 01:23 AM