గూఢచర్యం కేసులో నిందితుడికి ఐదున్నరేళ్ల జైలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:05 AM
గూఢచర్యం కేసులో నిందితుడికి ఐదున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ...
విశాఖపట్నం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు
విశాఖపట్నం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గూఢచర్యం కేసులో నిందితుడికి ఐదున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. భారతీయ జాలర్లు కొందరు పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించగా, పాక్ నేవీ అధికారులు అరెస్టు చేసి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలోని సిమ్ కార్డులను 2021లో అల్తాఫ్ హుసేన్ అలియాస్ షకీల్ ఉపయోగించుకొని భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కోర్టులో నేరం నిర్ధారణ కావడంతో ఒక సెక్షన్ కింద ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా, మరో సెక్షన్ కింద రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.