Share News

ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీలో నిబంధనలకు తూట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:33 AM

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా వున్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ.. నిబంధనల ప్రకారం జరగడం లేదన్న ఆరోపిణలు వినిపిస్తున్నాయి. నియామకాల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను పక్కన పెట్టి, రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతిభ, అర్హతలను పక్కనపెట్టి, అధికారంలో వున్న పార్టీల నేతలు సిఫారసు చేసిన వారికే పోస్టింగులు ఇచ్చేందుకు అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీలో  నిబంధనలకు తూట్లు
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం

రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరుగుతున్నట్టు ఆరోపణలు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి

తుది జాబితాను అతనే తయారు చేసినట్టు ఫిర్యాదులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా వున్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ.. నిబంధనల ప్రకారం జరగడం లేదన్న ఆరోపిణలు వినిపిస్తున్నాయి. నియామకాల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను పక్కన పెట్టి, రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతిభ, అర్హతలను పక్కనపెట్టి, అధికారంలో వున్న పార్టీల నేతలు సిఫారసు చేసిన వారికే పోస్టింగులు ఇచ్చేందుకు అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఉగ్యోగి హవా...

జిల్లాలని వివిధ గ్రామాల్లో ఖాళీగా వున్న 77 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ఇటీవల వైద్య, ఆర్యోగ శాఖ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. స్థానికత, విద్యార్హతలు, ఇతర నిబంధనల మేరకు అర్హులను ఈ పోస్టుల్లో నియమించాలి. కాగా ఆశా వర్కర్ల నియామకాల వ్యవహారంలో సబ్బవరం మండలం గుల్లేపల్లి పీహెచ్‌సీ నుంచి ఇటీవల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిఇ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చిన ఒక ఉద్యోగి చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఆయా గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన నుంచి, ఎమ్మెల్యేల సిఫారసుల లేఖల వరకు సదరు ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. తొలుత ప్రతి పోస్టుకు మూడు పేర్లతో ఒక జాబితాను రూపొందించారు. అనంతరం తాము పోస్టింగ్‌ ఇవ్వాలనుకుంటున్న 77 మంది అభ్యర్థుల పేర్లతో మారో జాబితాను కలెక్టర్‌ ముందుంచినట్టు సమాచారం. వాస్తవంగా ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ అధికారం సంబంధిత కమిటీలకు ఉన్నప్పటికీ, సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే తుది జాబితా రూపొందించి కలెక్టర్‌కు నివేదించినట్టు తెలిసింది. తుది జాబితాను ఈనెల 5వ తేదీన విడుదల చేయాలని అధికారులు భావించినప్పటికీ, నియామకాల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై కొంతమంది ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేయడంతో తుది జాబితాను విడుదల చేయలేదని చెబుతున్నారు.

ఆరోపణలు అవాస్తవం

డాక్టర్‌ అచ్యుతకుమారి, డీఎంహెచ్‌వో

ఆశా వర్కర్ల నియామకాల్లో నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణులు పూర్తిగా అవాస్తవం. ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ విషయంతో ప్రజాప్రతినిధులు ఎవరూ సిఫారసులు లేదా ఒత్తిళ్లు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా తుది జాబితాను రూపొందించాం. అనుమతి కోసం జిల్లా కలెక్టరు వద్ద పంపాము. జాబితా తయారీ విషయంలో తమ కార్యాలయం ఉద్యోగి పాత్ర ఏమీ లేదు.

Updated Date - Oct 08 , 2026 | 12:33 AM