ఎంపీగా విజయ్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:09 AM
రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ గురువారం న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ చాంబర్‌కు వెళ్లి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం చిన్న వయసులోనే దక్కించుకున్నారంటూ విజయ్‌ను ఆయన అభినందించారు.
రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ కలిసిన యువనేత
అనకాపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్ గురువారం న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ చాంబర్‌కు వెళ్లి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం చిన్న వయసులోనే దక్కించుకున్నారంటూ విజయ్‌ను ఆయన అభినందించారు.
కాగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన చింతకాయల విజయ్‌ను జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు విజయ్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.