Share News

ఉత్సవ్‌కు చురుగ్గా ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:57 AM

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఈనెల 30, 31 తేదీల్లో ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవ్‌కు ప్రధాన వేదిక అయిన అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంతోపాటు బెల్లం మార్కెట్‌ యార్డు, అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌ తమ పరిధిలోని అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఉత్సవ్‌ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

ఉత్సవ్‌కు చురుగ్గా ఏర్పాట్లు
అనకాపల్లిలో ఎన్టీఆర్‌ స్టేడియంలో సంగీత విభావరి కోసం నిర్మిస్తున్న వేదిక

ఎన్టీఆర్‌ స్టేడియంలో సంగీత విభావరికి వేదిక నిర్మాణం

మార్కెట్‌ యార్డులో ఫ్లవర్‌ షో

కొండకర్ల ఆవ వద్ద బోటింగ్‌కు మొదలైన పనులు

అనకాపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఈనెల 30, 31 తేదీల్లో ‘అనకాపల్లి ఉత్సవ్‌’ను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవ్‌కు ప్రధాన వేదిక అయిన అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంతోపాటు బెల్లం మార్కెట్‌ యార్డు, అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌ తమ పరిధిలోని అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఉత్సవ్‌ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో 30వ తేదీ సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రముఖ గాయని సునీత ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు స్టేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఫ్లవర్‌ షో పనులు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ స్టేడియంలో 31వ తేదీన ప్రముఖ గాయకుడు రామ్‌ మిరియాల ఆధ్వర్యంలో సంగీత విభావరి, క్రాకర్స్‌ షో, స్థానిక కళాకారుల ప్రదర్శనలు వుంటాయి.

ముత్యాలమ్మపాలెం బీచ్‌లో విద్యుద్దీపాలు, టెంట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఫొటో బూత్స్‌, లైవ్‌ బ్యాండ్‌, బీచ్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహిస్తారు. ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కొండకర్ల ఆవ వద్ద ఫొటో బూత్స్‌, బోటు షికారు, ఫ్లాష్‌ షాపింగ్‌ పనులు జోరందుకున్నాయి.

Updated Date - Jan 29 , 2026 | 12:57 AM