Share News

పర్యాటక ప్రాజెక్టులను ఆకర్షించేలా వీఈఆర్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:21 AM

పర్యాటక ప్రాజెక్టులను పెద్దఎత్తున ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.సుబ్రహ్మణ్యం సూచించారు. వీఈఆర్‌పై సోమవారం వీఎంఆర్‌డీఏలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, పర్యాటక రంగం వంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు.

పర్యాటక ప్రాజెక్టులను ఆకర్షించేలా వీఈఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం. చిత్రంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఉన్నారు

నిర్వాసితులకు తగిన పునరావాసం కల్పించాలి

నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యుడు ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాజెక్టులను పెద్దఎత్తున ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.సుబ్రహ్మణ్యం సూచించారు. వీఈఆర్‌పై సోమవారం వీఎంఆర్‌డీఏలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, పర్యాటక రంగం వంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యాలను పెంచుకోవాలని, న్యాయ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయాలని, సవాళ్లను పరిష్కరించుకుంటూ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అవసరమైతే తిరుపతి ఐఐటీ సహకారం తీసుకోవాలన్నారు. పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నందున నిర్వాసితులకు తగిన పునరావాసం కల్పించాలన్నారు. పర్యాటక రంగంలో రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచాలని, పురాతన సంపదను సంరక్షించుకోవాలన్నారు. వికలాంగులు సహా అన్ని వర్గాలకు సమగ్ర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పర్యాటకుల రాకను పెంచేలా జల క్రీడలు పెరగాలన్నారు. వీఈఆర్‌ సీఈఓ యువరాజ్‌ మాట్లాడుతూ, మూడు కమిటీలు ప్రాజెక్టుల అమలు కోసం పనిచేస్తున్నాయన్నారు. విశాఖలో బే సిటీ ప్రాజెక్టు కీలకమైనదిగా పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో చేపట్టబోయే ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి అవకాశాలు వివరించారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కేంద్ర వ్యాపార జిల్లా అభివృద్ధి, మురికివాడల పునరాభివృద్ధి, తాగునీటి ఎద్దడి నివారణ తదితర అంశాలు వివరించారు. సమావేశంలో విశాఖపట్నం పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోశ్ని అపరంజి, జిల్లా పర్యాటక శాఖాధికారిణి మాధవి, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఎలీప్‌, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, బ్రాండిక్స్‌, సీఫుడ్‌ ఎగుమతిదారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పెట్టుబడుల అంశాలపై చర్చించారు.

Updated Date - Aug 11 , 2026 | 01:21 AM