Share News

కూరగాయాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:47 AM

కార్తీక మాసం ఆరంభంలోనే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం, పది రోజుల క్రితం వున్న ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. కార్తీక మాసంలో రానున్న రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో సంభవించిన ఆర్నబ్‌ తుఫాన్‌, ఈ నెలల వచ్చిన మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోజుల తరబడి పొలాల్లో నీరు నిలవడంతో కూరగాయ పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పాడైపోయి, రైతులు పీకేయాల్సి వచ్చింది.

కూరగాయాలు
కూరగాయలు

మార్కెట్‌లో మండుతున్న ధరలు

తుఫాన్‌ వర్షాలకు దెబ్బతిన్న పంటలు

భారీగా తగ్గిన దిగుబడులు

కార్తీక మాసం రాకతో పెరిగిన వినియోగం

వారం క్రితంతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు అధికం

వినియోగదారుల బెంబేలు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ఆరంభంలోనే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం, పది రోజుల క్రితం వున్న ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. కార్తీక మాసంలో రానున్న రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. గత నెలలో సంభవించిన ఆర్నబ్‌ తుఫాన్‌, ఈ నెలల వచ్చిన మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోజుల తరబడి పొలాల్లో నీరు నిలవడంతో కూరగాయ పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పాడైపోయి, రైతులు పీకేయాల్సి వచ్చింది. దీంతో జిల్లాలోని కె.కోటపాడు, కశింకోట, దేవరాపల్లి, గొలుగొండ, రావికమతం, తదితర మండలాల్లో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆయా ప్రాంతాల నుంచి అనకాపల్లి, నర్సీపట్నం మార్కెట్లకు కూరగాయల దిగుమతి తగ్గింది. ఈ ప్రభావం అన్ని రకాల కూరగాయల ధరలపైపడింది. దీనికితోడు కార్తీక మాసం ఆరంభం కావడం, పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్షలు చేపట్టడంతో కూరగాయల వినియోగం బాగా పెరిగింది. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడ కూరగాయలు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. గత వారంతో పోల్చితే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయన్నారు.

అనకాపల్లి పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌లో ఉల్లిపాయలు గత వారం కిలో రూ.50 వుండగా, ఇప్పుడు రూ.60కి అమ్ముతున్నారు. బంగాళాదుంపలు రూ.15 నుంచి రూ.20కి, బీరకాయలు రూ.70 నుంచి రూ.100కు, బెండకాయలు రూ.40 నుంచి రూ.50కి, దొండకాయలు రూ.30 నుంచి రూ.60కి, టమాటా రూ.25 నుంచి రూ.30కి, వంకాయలు (తెలుపు) రూ.40 నుంచి రూ.60కి, వంకాయలు (నలుపు) రూ.50 నుంచి రూ.80కి పెరిగాయి. ఇక క్యారెట్‌ రూ.40 రూ.50కి, 12. బీన్స్‌ రూ.80 నుంచి రూ.100కి, కాకరకాయలు రూ.50 నుంచి రూ.60కి, చిక్కుడుకాయలు రూ.50 నుంచి రూ.70కి, గోరుచిక్కుడు రూ.40 నుంచి రూ.50కి, బరబాటి రూ.40 నుంచి రూ.70కి, కాలీఫ్లవర్‌ రూ. 30 నుంచి రూ.40కి పెరిగాయి.

నర్సీపట్నంలో గత వారం కిలో రూ.60 ఉన్న దొండ, బెండ, బీర, కాకర, వంకాయలు ఆదివారం రూ.80కి చేరాయి. ఉల్లిపాయలు రెండు నెలలుగా కంట నీరు తెప్పిస్తున్నాయి. నాసిరకం ఉల్లిపాయులు కిలో రూ.50, పెద్ద ఉల్లిపాయలు రూ.60కి విక్రయిస్తున్నారు. నాలుగు ములక్కాడలు రూ.50లు, లేదా కిలో రూ.200కు అమ్ముతున్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:47 AM