Share News

పల్లె ప్రగతికి వీబీ-జీరామ్‌జీ వరం

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:44 AM

వికసిత్‌ భారత్‌ - గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా గ్రామీణ్‌ (వీబీ-జీరామ్‌జీ) కార్యక్రమం పల్లెసీమల ప్రగతికి గొప్పవరమని, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కోరారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం వీబీ-జీరామ్‌జీ కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు.

పల్లె ప్రగతికి వీబీ-జీరామ్‌జీ వరం
అక్కిరెడ్డిపాలెంలో వీబీ-జీరామ్‌జీ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

గ్రామీణ మహిళలు, యువత ఆర్థిక స్వావలంబన సాధించాలి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ - గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా గ్రామీణ్‌ (వీబీ-జీరామ్‌జీ) కార్యక్రమం పల్లెసీమల ప్రగతికి గొప్పవరమని, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కోరారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో గురువారం వీబీ-జీరామ్‌జీ కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వికసిత్‌ భారత్‌- 2047 కలను సాకరం చేసే విషయంలో మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. గత నెల వరకు అమల్లో వున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలు మార్పులు చేసి, మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రభుత్వం వీబీ-జీరామ్‌జీని తీసుకువచ్చిందని అన్నారు. జాబ్‌కార్డు వున్న ప్రతి కుటుంబానికి ఏడాదిలో 125 రోజుల పాటు చట్టబద్ధంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కలెక్టర్‌ వివరించారు. అనంతరం వీబీ-జీరామ్‌జీ మహిళా శ్రామికులతో కలిసిపోస్టర్లు, కర పత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:44 AM