జడ్పీ సీఈవోగా వాసుదేవరావు బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:32 AM
స్థానిక జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.వాసుదేవరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లకు సీఈవోల నియామకంలో భాగంగా కాకినాడలోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా పని చేస్తున్న పి.వాసుదేవరావుకు పదోన్నతి కల్పించి అల్లూరి జిల్లాకు సీఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత మోదకొండమ్మను దర్శించుకున్నారు.
పాడేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.వాసుదేవరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లకు సీఈవోల నియామకంలో భాగంగా కాకినాడలోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా పని చేస్తున్న పి.వాసుదేవరావుకు పదోన్నతి కల్పించి అల్లూరి జిల్లాకు సీఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత మోదకొండమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జడ్పీ కార్యాలయానికి చేరుకుని సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో జడ్పీ సేవలను ప్రతి ప్రాంతానికి అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డీడీవో జయప్రకాశ్, ఎంపీడీవో తేజ్‌రతన్, డిప్యూటీ ఎంపీడీవో ఆర్.రమేశ్, తదితరులు ఉన్నారు.