జడ్పీ సీఈవోగా వాసుదేవరావు
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:15 PM
నూతనంగా ఏర్పడిన అల్లూరి జిల్లా పరిషత్‌కు ముఖ్యకార్యనిర్వాహణాధికారిగా పి.వాసుదేవరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ డీడీవో అల్లూరి సీఈవోగా నియామకం
పాడేరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పడిన అల్లూరి జిల్లా పరిషత్‌కు ముఖ్యకార్యనిర్వాహణాధికారిగా పి.వాసుదేవరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌గా ఉన్న నేపథ్యంలో జడ్పీ పాలకమండలి గడవు ముగిసిన తర్వాత స్థానికంగానే నూతనంగా జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడలోని డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.వాసుదేవరావును స్థానిక జిల్లాపరిషత్‌కు సీఈవోగా నియమించారు. దీంతో ఆయన సోమవారం ఇక్కడి వచ్చి విధుల్లో చేరనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న తరుణంలో కొత్త జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం సీఈవోలను నియమించింది.