వరహా నది రక్షణ గోడ పనులు త్వరలో ప్రారంభం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:27 AM
మండలంలోని సోముదేవుపల్లి వద్ద కోతకు గురవుతున్న వరహా నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.95 కోట్లు మంజూరు చేసిందని, కొద్ది రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి, పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన డీసీఈ ఆంజనేయులు, ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈ వి.బాలసూర్యంతో కలిసి సోముదేవుపల్లి వద్ద వరహా నది గట్టును పరిశీలించారు.
జలవనరుల శాఖ సీఈ వై.శ్రీనివాసరావు
ఎస్.రాయవరం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సోముదేవుపల్లి వద్ద కోతకు గురవుతున్న వరహా నది గట్టుకు రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.95 కోట్లు మంజూరు చేసిందని, కొద్ది రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తిచేసి, పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన డీసీఈ ఆంజనేయులు, ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈ వి.బాలసూర్యంతో కలిసి సోముదేవుపల్లి వద్ద వరహా నది గట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరైన నిధులతో నది గట్టు కోతకు గురైన ప్రదేశం వద్ద రక్షణ గోడ నిర్మాణం, గ్యాప్ ఫిల్లింగ్, రెండు మదుములు, గ్రోయిన్ నిర్మాణం చేపడతామని, ఇంకా రెండు పంట కాలువల్లో పూడిక తీయిస్తామని చెప్పారు. ఆయన వెంట జలవనరుల శాఖ డీఈ ఎంవీ సురేశ్‌కుమార్, ఏఈ అమీనా భాను వున్నారు.