వంజంగి హిల్స్ తాత్కాలికంగా మూసివేత
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:06 AM
మండలంలోని ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఇటీవల ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు వంజంగి గ్రామం నుంచి సందర్శనీయ ప్రదేశానికి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది.
- ఆర్నబ్ తుఫాన్‌కు రోడ్డు ధ్వంసం కావడమే కారణం
పాడేరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఇటీవల ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు వంజంగి గ్రామం నుంచి సందర్శనీయ ప్రదేశానికి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న పలు రిసార్టులు సైతం దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో పర్యాటకులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. పలువురు పర్యాటకులు సాహసాలు చేయడంతో వాహనాలు ప్రమాదానికి గురైన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో రోడ్డును పూర్తిగా బాగు చేసే వరకు వంజంగి హిల్స్‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో అటు పర్యాటకులు, ఇటు చిరువర్తకులు నిరాశ చెందుతున్నారు. అధికారులు వంజంగి రోడ్డుకు మరమ్మతులు వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.