Share News

మరో మూడు వారాలు వంజంగి హిల్స్‌ మూసివేత

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:52 PM

మండలంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌ను మారో మూడు వారాలు మూసివేస్తున్నట్టు స్థానిక అటవీ రేంజ్‌ అధికారి కె.దేవిరాజేశ్వరి ఆదివారం విలేకరులకు తెలిపారు.

మరో మూడు వారాలు వంజంగి హిల్స్‌  మూసివేత
వంజంగి హిల్స్‌ ప్రవేశ మార్గం

పాడేరు అటవీ రేంజర్‌ కె.దేవిరాజేశ్వరి

పాడేరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌ను మారో మూడు వారాలు మూసివేస్తున్నట్టు స్థానిక అటవీ రేంజ్‌ అధికారి కె.దేవిరాజేశ్వరి ఆదివారం విలేకరులకు తెలిపారు. గత నెలలో సంభవించిన ఆర్మబ్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచాయి. ఈక్రమంలో వంజంగి గ్రామం నుంచి సందర్శనీయ ప్రదేశానికి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. ఆప్రాంతంలో ఉన్న పలు రిసార్టులు సైతం దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోడ్డు తీవ్రంగా ధ్వంసం కావడంతో పర్యాటకులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. ఈక్రమంలో గత వారం నుంచి వంజంగి హిల్స్‌ ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. అయితే పర్యాటకులు రాకపోకలలు సాగించేందుకు అనువుగా రోడ్డు సిద్ధం కాకపోవడంతో మరో మూడు వారాలు వంజంగి హిల్స్‌ను మూసివేస్తున్నట్టు అటవీ రేంజ్‌ అధికారి తెలిపారు. ఈమార్పును గమనించి పర్యాటకులు, ప్రజలు తమకు సహకరించాలని ఆమె కోరారు.

Updated Date - Nov 15 , 2026 | 11:52 PM