వ్యవసాయ పనుల్లో ఐక్యత
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:16 AM
మండలంలో ఆదివాసీ రైతులు వ్యవసాయ పనుల్లోనూ ఐక్యత చాటుకుంటున్నారు. ఆదివాసీ రైతులకు వ్యవసాయ పనులకు కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత ఉండదు.
ఒకరికొకరు సాయం చేసుకుంటున్న ఆదివాసీలు
గూడెంకొత్తవీధి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ రైతులు వ్యవసాయ పనుల్లోనూ ఐక్యత చాటుకుంటున్నారు. ఆదివాసీ రైతులకు వ్యవసాయ పనులకు కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో గ్రామానికి చెందిన గిరిజనులందరూ ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకుంటారు. దుక్కులు, ఆకుతీత, వరి నాట్ల పనుల్లో గ్రామానికి చెందిన గిరిజనులందరూ కలిసి పని చేసుకుంటారు. ఒకరోజు ఒకరి పొలం దున్నెందుకు రైతులు అందరూ వస్తే మరో రోజు వేరే రైతు పొలం దున్నేందుకు వెళతారు. దుక్కి, ఆకుతీత, వరి నాట్లులోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారే తప్ప కూలీ చెల్లించే పద్ధతి అరుదు. బుధవారం అద్దరవీధిలో గిరిజన రైతులందరూ ఒక రైతు పంట పొలాల్లో దుక్కిచేస్తూ కనిపించారు.