Share News

ఎనలేని సంతోషిం

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:17 AM

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించారు మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన లగుడు (గట్రెడ్డి) సంతోషి. శుక్రవారం రాత్రి విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మాకవరపాలెం తహశీల్దారు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె.. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్‌-2 పరీక్షా ఫలితాల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రెండు రోజులు గడవకముందే గజిటెడ్‌ ర్యాంకు అధికారి అయ్యారు.

   ఎనలేని సంతోషిం
లగుడు సంతోషి

గ్రూప్‌-1 ఫలితాల్లో ఆర్టీఓ పోస్టు

మరోసారి సత్తాచాటిన దొండపూడి యువతి

ఇటీవల గ్రూప్‌-2 ఉద్యోగానికి ఎంపిక

రెండు రోజులు తిరగకుండానే గజిటెడ్‌ అధికారిగా..

రావికమతం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించారు మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన లగుడు (గట్రెడ్డి) సంతోషి. శుక్రవారం రాత్రి విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మాకవరపాలెం తహశీల్దారు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె.. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్‌-2 పరీక్షా ఫలితాల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రెండు రోజులు గడవకముందే గజిటెడ్‌ ర్యాంకు అధికారి అయ్యారు.

నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం గ్రామానికి చెందిన లగుడు సూర్యనారాయణ, సత్యవతిల కుమార్తె అయితే సంతోషి.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి సత్యవతి, అన్న్య రాజేశ్‌ల సహకారంతో ఎంటెక్‌ వరకు చదివారు. ఇంజనీరింగ్‌ చదువుతన్న సమయంలో దొండపూడికి చెందిన గట్రెడ్డి గోపితో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతో సంతోషి.. పలు రకాల పోటీ పరీక్షలకు గట్టిగా సన్నద్ధం అయ్యారు. గతంలో గ్రూప్‌-4కు ఎంపిక కావడంతో రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. ఈ నెల 28వ తేదీన విడుదలైన గ్రూప్‌-2 ఫలితాల్లో సంతోషి రాష్ట్ర సచివాలయంలో ఏఎస్‌ఓగా ఎంపికయ్యారు. శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో సంతోషి ఆర్టీవోగా ఎంపికయ్యారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నెరవేరిందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, సంతోషికి ఫోన్‌ చేసి అభినందించారు.

Updated Date - Jan 31 , 2026 | 01:17 AM