పోర్టుకు అతి భారీ నౌక
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:54 AM
విశాఖపట్నం పోర్టు మరో మైలురాయిని చేరుకుంది. కేప్‌సైజ్ బల్క్ క్యారియర్ నౌక ‘ఎంవీ గ్రేషియస్’ను శుక్రవారం ఇన్నర్ హార్బర్‌లోని ఈక్యూ-1 వద్ద విజయవంతంగా బెర్తింగ్ చేసింది.
1,00,198 మెట్రిక్ టన్నుల కార్గోతో రాక
ఈక్యూ-1 వద్ద విజయవంతంగా బెర్తింగ్
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు మరో మైలురాయిని చేరుకుంది. కేప్‌సైజ్ బల్క్ క్యారియర్ నౌక ‘ఎంవీ గ్రేషియస్’ను శుక్రవారం ఇన్నర్ హార్బర్‌లోని ఈక్యూ-1 వద్ద విజయవంతంగా బెర్తింగ్ చేసింది. సుమారు 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు, 12.2 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన నౌక 1,00,198 మెట్రిక్ టన్నుల కార్గోతో పోర్టుకు వచ్చింది. చైర్మన్ జస్మీత్‌సింగ్ బింద్రా, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి అందించిన మార్గదర్శకత్వం, సిబ్బంది కృషితో అతి భారీ నౌకను విజయవంతంగా బెర్తింగ్ చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో విశాఖపట్నం పోర్టు కేప్ స్థాయి నౌకలను బెర్తింగ్ చేసే సదుపాయాన్ని మెరుగు పరుచుకున్నట్టయ్యింది. దీనివల్ల కార్గో నిర్వహణలో పోర్టు సామర్థ్యం మరింత పెరగనున్నది.