Share News

ద్విచక్రవాహనాలు ఢీ : యువకుడి మృతి

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:46 PM

మండలంలోని రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ద్విచక్రవాహనాలు ఢీ : యువకుడి మృతి
మృతిచెందిన పాడి రాజా (ఫైల్‌ఫొటో)

మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

కొయ్యూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని రావణాపల్లికి చెందిన పాడి రాజా (23) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను ఏర్పాటు చేసుకొనేందుకు ఆదివారం మధ్యాహ్నం తోటలూరు గ్రామానికి వెళ్లాడు. అక్కడ కూలీలను ఏర్పాటు చేసుకుని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. కృష్ణాదేవిపేట నుంచి పిట్టచలం గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న కొర్రా లక్ష్మణ్‌, గడారి సింహాచలం అతివేగంగా వస్తూ రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో రాజా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో రాజా వాహనంపై నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో తల వెనుక భాగాన బలమైన గాయమైంది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన రాజాను కృష్ణాదేవిపేట పీహెచ్‌సీ తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెనుక నుంచి ఢీకొట్టిన లక్ష్మణ్‌, సింహాచలంలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి చిన్నాన్న పాడి నాగు ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న నిందితులను వైద్య పరీక్షలకు తరలించారు.

Updated Date - Aug 02 , 2026 | 10:46 PM