Share News

రంప ఏజెన్సీలో ఇద్దరు టీడీపీ నేతలు సస్పెన్షన్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:21 PM

అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై తొలి వేటు పడింది.

రంప ఏజెన్సీలో ఇద్దరు టీడీపీ నేతలు సస్పెన్షన్‌

టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి

త్వరలో అల్లూరి ఏజెన్సీలో నేతలపైనా వేటు?

పాడేరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై తొలి వేటు పడింది. రంపచోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలోని ఏటపాక మండలానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు మువ్వా శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు టీడీపీ అరకులోయ పార్లమెంట్‌ అధ్యక్షురాలు మోజూరు తేజోవతి శుక్రవారం అధికారికంగా తెలిపారు. ఈ ఇద్దరు నేతలు పార్టీ నిబంధనలను అతిక్రమించడం వల్లే చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లూరి జిల్లాలో కూటమి పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా పలు ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పోటీగా బరిలో ఉన్న వారిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని పలువురు టీడీపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:21 PM