జిల్లాలో మరో రెండు కోర్టులు
ABN , Publish Date - May 04 , 2026 | 01:00 AM
జిల్లాలో ఆదివారం రెండు కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు.
గాజువాకలో ఫ్యామిలీ కోర్టు
భీమిలిలో సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు
ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి
గాజువాక/ భీమునిపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆదివారం రెండు కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. వీటి ద్వారా కక్షిదారులకు న్యాయ సేవలు మరింత చేరువకానున్నాయన్నారు. గాజువాక కోర్టు కాంప్లెక్స్‌లో నిర్మించిన ఫ్యామిలీ కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ రవినాఽథ్ తిల్హారి ప్రారంభించారు. దీనిద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యే ఉంటుందన్నారు. భీమిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టును జస్టిస్ రవినాథ్ తిల్హారి ప్రారంభించారు. ప్రథమ సీనియర్ సివిల్ జడ్జిగా డి.సోని బాధ్యతలు స్వీకరించారు. అతిథులను భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.జనార్దనరావు సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. కోర్టు మంజూరు కావడానికి సహకరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ రవి చీమలపాటికి కృతజ్ఞతలు తెలిపారు. భీమిలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ డి.సౌజన్య కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమాల్లో హైకోర్టు జడ్జి జస్టిస్ రవి చీమలపాటి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి చిన్నంశెట్టి రాజు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ, గాజువాక ఎనిమిదో డిస్ట్రిక్ జడ్జి ఎస్.కవిత, ఎనిమిదో అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెసన్స్ జడ్జి జి.షణ్ముఖరావు, మూడో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వి.పల్లవి, జడ్జిలు ఎంవీ.శేషమ్మ, వై.శ్రీలక్ష్మి, ఎ.రమేష్, న్యాయవాదులు ఎంఎస్ గౌతమ్, పి.వెంకటేశ్వరరావు, అండిబోయిన లక్ష్మి, నాగదేవి, ఆదిలక్ష్మి, సీతామహాలక్ష్మి, మల్లిక వెంకటలక్ష్మి, శ్యామ్, లక్ష్మణ్, విశాఖ నార్త్ ఏసీపీ అప్పలరాజు, భీమిలి తహశీల్దార్ పైల రామారావు పాల్గొన్నారు.