Share News

ఐటీ హిల్స్‌కు మరో 2 బస్సులు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:25 AM

రుషికొండలో ఐటీ హిల్స్‌కు రెండు కొత్త బస్సులను శనివారం ప్రారంభించారు.

ఐటీ హిల్స్‌కు మరో 2 బస్సులు

ప్రారంభించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

రుషికొండలో ఐటీ హిల్స్‌కు రెండు కొత్త బస్సులను శనివారం ప్రారంభించారు. రవాణా శాఖా మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజులు కలిసి మద్దిలపాలెం డిపోలో ఈ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ పేరు ప్రతిష్ఠలను తిరిగి నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ, ఐటీ హిల్స్‌కు ప్రస్తుతం ఎనిమిది బస్సులు నడుస్తున్నాయని, ఇన్ఫోసిస్‌ కోరడంతో వారి కోసం ఈ రెండు బస్సులు వేశామన్నారు. ఇవి విజయనగరం-ఐటీ హిల్స్‌-కొత్తవలస మార్గంలో ప్రయాణిస్తాయన్నారు. ఐటీ హిల్స్‌కు అన్ని వసతులు సమకూరుస్తామని చెప్పారు. అనంతరం ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ దొన్నుదొర, రీజనల్‌ మేనేజర్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:25 AM