జిల్లాకు రెండు మహాప్రస్థానం వాహనాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:41 PM
జిల్లాకు కేటాయించిన రెండు మహాప్రస్థానం వాహనాలను కలెక్టర్ టి.నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం రాత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రారంభించిన కలెక్టర్ నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
పాడేరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కేటాయించిన రెండు మహాప్రస్థానం వాహనాలను కలెక్టర్ టి.నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం రాత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గిరిజనుల పార్థివదేహాలను తరలించేందుకు గాను రెండు మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇది జిల్లా చరిత్రలో ఒక ప్రత్యేకమైనదని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రియాజ్‌బేగ్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.ప్రతాప్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.