Share News

రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:42 AM

నర్సీపట్నం పోలీసులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ (ద్రవ గంజాయి)ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ పి.శ్రీనివాసరావు గురువారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ స్వాధీనం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు. వెనుక ముసుగుల్లో నిందితులు. 10ఎన్‌పీ3: (ఇన్‌సెట్‌లో) హ్యాష్‌ ఆయిల్‌ ప్యాకెట్లు.

యువతి, యువకుడు అరెస్టు

నర్సీపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం పోలీసులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ (ద్రవ గంజాయి)ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ పి.శ్రీనివాసరావు గురువారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అందించిన సమాచారంతో పట్టణ సీఐ గఫూర్‌, ఎస్‌ఐ రమేశ్‌, సిబ్బందితో కలిసి గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో చింతపల్లి వైపు నుంచి బైక్‌ మీద వస్తున్న యువతీయువకుడిని ఆపి త నిఖీ చేశారు. వారి వద్ద రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ పట్టుబడింది. వీరుచ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెం పంచాయతీ కిట్టాబు గ్రామానికి చెందిన మర్రి ఇందు, డేకురాయి గ్రామానికి చెందిన పాంగి శివగా గుర్తించారు. వీరిద్దరు ప్రేమికులు. ఒడిశా సరిహద్దులోని ఎగువ జనభ గ్రామంలో రెండు కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరి నుంచి రెండు సెల్‌ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. పోలీసులు పట్టుకున్న హ్యాష్‌ ఆయిల్‌ విలువ రూ.27.75 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Sep 11 , 2026 | 12:42 AM