Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:39 AM

మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నక్కపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెం గ్రామానికి చెందిన శీరం నూకరాజు (38), పోలినాటి సూర్యకుమార్‌ (30) ద్విచక్ర వాహనంపై నక్కపల్లి వచ్చారు. ఇక్కడ పని ముగించుకొని రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం జంక్షన్‌ వద్ద మలుపు తిరుగుతుండగా, అదే సమయంలో అడ్డరోడ్డు వైపు నుంచి నక్కపల్లి వైపు వస్తున్న మరో బైక్‌ బలంగా ఢీకొన్నది. దీంతో నూకరాజు, సూర్యకుమార్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన బైక్‌పై వున్న పి.రామకృష్ణ, నాగేశ్వరరావులకు గాయాలయ్యాయి. సారిపల్లివానిపాలేనికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Oct 09 , 2026 | 12:39 AM