ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరి మృతి
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:06 AM
అనకాపల్లి మండలం మార్టూరు రెవెన్యూ పరిధిలోని క్వారీకి వెళుతున్న కంప్రెషనర్ ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- మార్టూరు రెవెన్యూ పరిధిలోని క్వారీ వద్ద ఘటన
తుమ్మపాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి మండలం మార్టూరు రెవెన్యూ పరిధిలోని క్వారీకి వెళుతున్న కంప్రెషనర్ ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద మాకవరం గ్రామానికి చెందిన తుంపాల నాగేశ్వరరావు(40), మాధవ ప్రధాని(27) మార్టూరు రెవెన్యూ పరిధిలో గల ఒక క్వారీలో కంప్రెషర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున కంప్రెషర్ ట్రాక్టర్‌తో క్వారీకి బయలుదేరారు. కొండపై గల క్వారీకి వెళుతున్న మార్గమధ్యంలో కంప్రెషర్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ వారిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తుంపాల నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఒడిశా రాష్ట్రం బల్లంగిరి జిల్లాకు చెందిన మాధవ ప్రధాని కుటుంబంతో వలస వచ్చి మాకవరం గ్రామంలో నివాసముంటున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. రూరల్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.