Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:31 AM

మండలంలోని నిమ్మలపాలెం గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
మృతులు అబ్రహాం,కృష్ణకుమార్‌ (ఫైల్‌)

మృతులిద్దరూ బావ, బావమరిదిలు

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నిమ్మలపాలెం గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులిద్దరూ బావ, బావమరిదిలు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గూడెంకొత్తవీధి మండలం పెదవలస గ్రామ పంచాయతీ బడ్డుమామిడివీఽధికి చెందిన దేశగిరి కృష్ణకుమార్‌, మొండిగెడ్డ గ్రామానికి చెందిన చినకల అబ్రహాంలు బావ, బావమరిది. వీరిద్దరూ మంగళవారం రాత్రి చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు వెళ్లారు. రాత్రి 12 గంటలకు పెదవలసకు తిరుగు ప్రయాణమయ్యారు. నిమ్మలపాలెం వంతెన వద్దకు వచ్చేసరికి నేరెళ్లబంధ గ్రామం నుంచి చింతపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకటరావు ఎదురుగా వస్తున్న కృష్ణకుమార్‌, అబ్రహాంల వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో కృష్ణకుమార్‌, అబ్రహాంలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వెంకటరావు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జీకేవీధి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:31 AM