రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:33 AM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం మండలంలోని గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ఆంధ్ర రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ సురేశ్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
డుంబ్రిగుడ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం మండలంలోని గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ఆంధ్ర రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ సురేశ్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోసెఫ్ (21) సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచిస్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. హుకుంపేట మండలం గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) స్నేహితుడితో కలిసి చటువా గ్రామంలో జరుగుతున్న పండుగను చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. గోరాపూర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో అర్ధరాత్రి ఈ రెండు బైకులు ఎదురెదురుగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. అక్కడికక్కడే మువ్వల శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోసెఫ్‌ను అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని యండపల్లివలస వద్ద మృతి చెందాడు. శ్రీనుతో పాటు ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతనిని అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కూడా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.