Share News

టీడబ్ల్యూ డీడీకి డీఈవోగా అదనపు బాధ్యతలు

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:08 PM

గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళకు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్‌ నిషాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

టీడబ్ల్యూ డీడీకి డీఈవోగా అదనపు బాధ్యతలు
పీబీకే.పరిమిళ

’ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

కొలిక్కి వచ్చిన డీఈవో బాధ్యతలు అప్పగింత వ్యవహారం

పాడేరు, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళకు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్‌ నిషాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు డీఈవోగా పనిచేసిన డాక్టర్‌ కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్‌ వైఖరికి మనస్తాపానికి గురైన ఈనెల 3వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. అయితే స్కూళ్లు పునఃప్రారంభం, పాఠ్యపుస్తకాలు, ఇతర కానుకల పంపిణీ నేపథ్యంలో డీఈవో బాధ్యతలు ఎవరికీ అప్పగించని వైనంపై ఈనెల 10న ‘డీఈవో బాధ్యతల అప్పగింతపై తర్జనభర్జన’ శీర్షిన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. దీంతో టీడబ్ల్యూ డీడీ పరిమిళకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jun 11 , 2026 | 11:08 PM