కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:05 AM
దేశ రక్షణలో అలుపెరుగని పోరాటం చేసి.. సముద్ర జలాల్లో భారత్‌కు విజయాన్ని అందించిన వీర సైనికులకు శుక్రవారం తూర్పు నావికా దళం ఘన నివాళులర్పించింది.
దేశ రక్షణలో అలుపెరుగని పోరాటం చేసి.. సముద్ర జలాల్లో భారత్‌కు విజయాన్ని అందించిన వీర సైనికులకు శుక్రవారం తూర్పు నావికా దళం ఘన నివాళులర్పించింది. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద గల విక్టరీ ఎట్ సీ స్మారక చిహ్నం వద్ద కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ పుష్పగుచ్ఛం సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు. భారత సైన్యం తరుపున కర్నల్ వి.సామ్యూయెల్ ప్రకాష్, భారత వైమానిక దళం తరఫున గ్రూప్ కెప్టెన్ పి.శ్యామ్‌కుమార్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీపీ రంగాచార్యులు మాజీ పెట్టీ ఆఫీసర్, కె.జగన్ ఆచార్య- మాజీ చీఫ్ మెషినిస్ట్ (రిటైర్డ్), రియల్ అడ్మిరల్ రవికిరణ్ (రిటైర్డ్) నేవీ ఫౌండేషన్ అధ్యక్షులు, వింగ్ కమాండర్ పి.సి.శేఖర్ (రిటైర్డ్), జెడ్‌ఎస్‌డబ్ల్యూఓ, తదితరులు పాల్గొన్నారు.
- బీచ్‌రోడ్డు, ఆంధ్రజ్యోతి