Share News

28 నుంచి ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ కార్మికులు సమ్మె

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:09 PM

ఐటీడీఏ నిర్వహణలో ఉన్న అరకులోయ ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ కార్మికులు శనివారం సమ్మె నోటీసులను సంబంధిత మేనేజర్లకు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు.

28 నుంచి ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ కార్మికులు సమ్మె
అసిస్టెంట్‌ మేనేజర్‌కు సమ్మె నోటీసును అందజేస్తున్న ట్రైబల్‌ మ్యూజియం కార్మికులు

అధికారులకు నోటీసులు ఇచ్చిన కార్మికులు

అరకులోయ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ నిర్వహణలో ఉన్న అరకులోయ ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ కార్మికులు శనివారం సమ్మె నోటీసులను సంబంధిత మేనేజర్లకు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. సీనియారిటీని అనుసరించి కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని ఐటీడీఏ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాడి రాజు, గౌరవాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఐటీడీఏ అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

Updated Date - Jan 24 , 2026 | 11:09 PM