Share News

గిరిజన యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:38 AM

మండల కేంద్రం రామాలయం సమీపంలో ఒక గిరిజన యువతి సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

గిరిజన యువతి ఆత్మహత్య
మృతురాలు దూసరి లక్ష్మి (ఫైల్‌ ఫొటో)

దేవరాపల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం రామాలయం సమీపంలో ఒక గిరిజన యువతి సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దూసరి లక్ష్మి(22), చిన్న కుమార్తె భవానీ దేవరాపల్లిలో రామాలయ సమీపంలోని తెనుగుపూడి రోడ్డులో ఒక అద్దె భవనంలో ఐదేళ్లుగా ఉంటున్నారు. లక్ష్మి ప్రైవేటు మెడికల్‌ ల్యాబ్‌లో పని చేస్తుండగా, భవానీ సెల్‌ పాయింట్‌లో పని చేస్తోంది. కాగా సోమవారం రాత్రి తన అక్క ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఫోన్‌ రావడంతో భవానీ వెంటనే ఇంటికి వెళ్లింది. గదిలో ఫ్యాన్‌ హుక్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉన్న అక్కను చూసి విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు రావడంతో మృతదేహాన్ని కె.కోటపాడు మార్చురీకి తరలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 12:38 AM