Share News

డ్వాక్రాలకు పారదర్శక సేవలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:54 AM

డ్వాక్రా మహళలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను, బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగంచేసుకొని ఆర్థిక స్వావలంబన పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకొనే రుణాల్లో గతంలో మాదిరిగా అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ‘మన డబ్బులు-మన లెక్కలు’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.

డ్వాక్రాలకు పారదర్శక సేవలు
వెలుగు కార్యాలయంలో ‘మన డబ్బులు- మన లెక్కల’ యాప్‌పై ‘ఈ-నారీ’లకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

అందుబాటులోకి ‘మన డబ్బులు-మన లెక్కలు’ యాప్‌

‘వెలుగు’లో అక్రమాలకు అడ్డుకట్ట

కొత్తగా ఈ-నారీ, సీఆర్పీలు

యాప్‌పై డ్వాక్రా మహిళలకు అవగాహన

కోటవురట్ల, ఫిబ్రవరి 5 (ఆంఽరఽధజ్యోతి): డ్వాక్రా మహళలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను, బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగంచేసుకొని ఆర్థిక స్వావలంబన పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకొనే రుణాల్లో గతంలో మాదిరిగా అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ‘మన డబ్బులు-మన లెక్కలు’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గతంలో డ్వాక్రా గ్రూపు లీడర్లు, బ్యాంకు సిబ్బంది, వెలుగు సిబ్బంది కుమ్మక్కై గ్రూపు సభ్యులకు తెలియకుండా పొదుపు నిధులు, రుణాల మంజూరు/ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరిగాయి. వీటిపై ఫిర్యాదులు సైతం అందాయి. పత్రికల్లో కథనాలు సైతం వచ్చాయి. ఇటువంటి అక్రమాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం ‘మన డబ్బులు- మన లెక్కలు’ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. దీనిని పక్కాగా అమలు చేసేందుకు ‘ఈ-నారీ సీఆర్పీ’ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి, పదో తరగతి పూర్తి చేసి, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఉపయోగించడం తెలిసి, పొదుపు గ్రూపు సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసే వారిని ‘ఈ-నారీ సీఆర్పీ’లుగా ఎంపిక చేశారు. డ్వాక్రా మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి వీరికి ఇటీవల వెలుగు ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ‘ఈ-నారీ సీఆర్పీ’లు నెలలో ఎనిమిది రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ఇందుకుగాను రోజుకు రూ.300 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.

అవకతవకలకు అవకాశం ఉండదు

అప్పలనర్స, వెలుగు ఏపీఎం, కోటవురట్ల మండలం

పొదుపు గ్రూపుల్లో అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మన డబ్బులు- మన లెక్కలు’ యాప్‌ పారదర్శకంగా పని చేస్తుంది. గ్రూపుల ఆర్థిక వనరులన్నీ ఈ యాప్‌లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం కూడా యాప్‌లో కల్పించారు. ‘ఈ-నారీ’లుగా నియమితులైన మహిళలు ఆయా గ్రామాల్లో డ్వాక్రా మహిళల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరూ యాప్‌ను ఉప యోగించుకునేలా అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం శిక్షణ తరగతులు నిర్వహించారు.

Updated Date - Feb 06 , 2026 | 12:54 AM