Share News

పారదర్శకంగా ఎన్నికల విధులు

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:20 AM

జిల్లాలో ఈ నెల 29న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి తరలింపు, పోలింగ్‌ నిర్వహణ, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియలన్నీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు.

పారదర్శకంగా ఎన్నికల విధులు
ఎలమంచిలిలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

నక్కపల్లి/ ఎలమంచిలి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 29న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి తరలింపు, పోలింగ్‌ నిర్వహణ, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియలన్నీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె నక్కపల్లి, ఎలమంచిలి మండల పరిషత్‌ కార్యాలయాల్లో పంచాయతీ ఎన్నికల ఆర్వోలు, ఏఆర్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళిని కచ్చితంగా అమలుచేయాలని, పోలింగ్‌ ప్రక్రియను సకాలంలో ప్రారంభించి, నిర్ణీత సమయానికి పూర్తిచేయాలని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌ విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే మండల కేంద్రంలో వున్న అధికారుల దృష్టికీ తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశాల్లో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, ఆర్డీవో రామలక్ష్మి, నక్కపల్లి తహశీల్దార్‌ చిన్నికృష్ణ, ఎంపీడీవో చలపతిరావు, ఏవో డి.సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 01:20 AM