ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:17 AM
మండలంలోని డముకు గ్రామ సమీపంలో ఘాట్ రోడ్డు ఆరవ నంబరు హెయిర్‌పిన్‌బెండ్ మలుపు వద్ద బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో భారీ ట్రాలీ పక్కకు ఒరిగిపోయింది.
మలుపు వద్ద భారీ ట్రాలీ ఒరిగిపోవడంతో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
అనంతగిరి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డముకు గ్రామ సమీపంలో ఘాట్ రోడ్డు ఆరవ నంబరు హెయిర్‌పిన్‌బెండ్ మలుపు వద్ద బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో భారీ ట్రాలీ పక్కకు ఒరిగిపోయింది. వెనుక చక్రం మలుపు వద్ద గల గోతిలో కూరుకుపోవడంతో ఒరిగిపోయింది. దీంతో కార్లు, ఆటోలు తప్ప భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం నుంచి అరకులోని రైల్వే వంతెన పనులకు సంబంధించిన ఇనుప సామగ్రిని ట్రాలీ తెలుస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో అరకు- విశాఖ, అలాగే విశాఖ- అరకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు నిలిచిపోయాయి. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎస్‌ఐ కె.శంకరరావు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాలీని పక్కకు తీసే చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.