లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్ సమస్య
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:43 PM
లంబసింగి ఘాట్ రోడ్డులో భారీ ట్యాంకర్ సాంకేతిక సమస్యలో నిలిచిపోయింది. దీంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ట్యాంకర్ నిలిచిపోవడంతో గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం
చింతపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): లంబసింగి ఘాట్ రోడ్డులో భారీ ట్యాంకర్ సాంకేతిక సమస్యలో నిలిచిపోయింది. దీంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి ఆయిల్ ట్యాంకర్ చింతపల్లి వస్తుంది. బోడకొండమ్మ ఆలయం దిగువ మలుపు వద్ద సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చింతపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆగిపోయిన ట్యాంక్‌ను అతికష్టంపై ఒక పక్కకు పెట్టించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.