ట్రాఫిక్ పద్మవ్యూహం
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:07 AM
నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ముఖ్యంగా కొత్తూరు జంక్షన్ నుంచి దేవరాపల్లి వె ళ్లే రహదారితో పాటు మెయిన్ రోడ్డు నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారిలో నిత్యం వాహనాల రద్దీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
- ఆక్రమణలతో కుంచించుకుపోయిన రహదారులు
- రాకపోకలకు వాహనచోదకుల ఇబ్బందులు
చోడవరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ముఖ్యంగా కొత్తూరు జంక్షన్ నుంచి దేవరాపల్లి వె ళ్లే రహదారితో పాటు మెయిన్ రోడ్డు నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారిలో నిత్యం వాహనాల రద్దీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు మార్గాల్లో దుకాణదారులు రోడ్డును ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొత్తూరు జంక్షన్ దేవరాపల్లి రోడ్డులో కొత్తగా వెలసిన దుకాణాలతో పరిస్థితి మరింత జటిలంగా మారిపోయింది. అసలే ఇరుకు రోడ్డు, ఆపై ఆక్రమణలతో ఈ రోడ్లు రద్దీగా మారాయి. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నా ఇటు పంచాయతీ కానీ, అటు పోలీసు అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.