గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - May 03 , 2026 | 12:41 AM
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. శనివారం మధ్యాహ్నం హనుమంతవాక జంక్షన్ నుంచి పాత వెంకోజీపాలెం వరకూ సుమారు రెండు గంటలు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇటు హనుమంతవాక, అటు కాన్వెంట్ జంక్షన్ వద్ద వాహనదారుల అవస్థలు
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. శనివారం మధ్యాహ్నం హనుమంతవాక జంక్షన్ నుంచి పాత వెంకోజీపాలెం వరకూ సుమారు రెండు గంటలు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక్కడ రోడ్డుకు ఎడమ వైపు పెద్ద సంఖ్యలో పండ్ల దుకాణాలు ఏర్పాటుచేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కావడంతో వాటిని కొనుగోలు చేయడానికి వాహనాల్లో వెళ్లేవారు, వాటిని అక్కడి నిలిపి బేరసారాలు చేస్తున్నారు. దాంతో వాహనాలు ఒక దాని వెనుక మరొకటి ఆగిపోతున్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడానికే పండ్ల వ్యాపారులే కారణమని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం ఉదయం కాన్వెంట్ జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు వైపు ఫ్లైఓవర్ల పైనుంచి వచ్చే వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.