లంబసింగి ఘాట్‌లో ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:40 PM
నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌లో సాంకేతిక సమస్యతో ఓ లారీ రహదారి మధ్యలో నిలిచిపోయింది.
రెండు గంటలపాటు నిలిచిన వాహనాలు
చింతపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్‌లో సాంకేతిక సమస్యతో ఓ లారీ రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. గురువారం ఉదయం 11 గంటల సమయంలో నర్సీపట్నం నుంచి ఓ లారీ లోడ్‌తో ఒడిశా వెళుతూ మార్గ మధ్యలో ఆగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ బి. సింహాచలం ఎస్‌ఐ జి. వీరబాబు, పోలీసులను సంఘటన స్థలానికి పంపించి ట్రాఫిక్‌ని క్లియర్ చేయించారు. దీంతో వాహనాలు రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.